–సిపిఎం డిమాండ్
CPM Demand : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : 11 వ వార్డు అర్బన్ కాలనీలో మురికి కాలువలు నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు కోరారు. శనివారం 11వ వార్డు అర్బన్ కాలనీ ముత్యాలమ్మ గుడి ప్రాంతంలో నిర్మిస్తున్న మురికి కాలువలను ఆటంకపరుస్తున్నా వారిపై చర్య తీసుకొని యధావిధిగా మురికి కాలువల నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేకమార్లు మురికి కాలువలు నిర్మించాలని ప్రభుత్వానికి కోరగా ప్రస్తుతం మంజూరు చేసి పనులు నడుస్తున్న సమయంలో కంకణాల రవీందర్ రెడ్డి అనే రైతు నిర్మించొద్దని ఆటంకపరుస్తున్నారని అన్నారు.
మురికి కాలువలు పూర్తయితే మురికి నీరు పొలంలోకి వస్తుందని ఆవేదనతో అడ్డుపడుతున్న రైతు సమస్యను సానుకూలంగా పరిష్కరించి మురికి కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ డ్రైనేజీ వాటర్ అంతా చివర్లో పొలాల్లోకి వెళ్లకుండా చివరిదాకా డ్రైనేజీ నిర్మాణం చేసి రైతుల, కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, అర్బన్ కాలనీ ముత్యాలమ్మ గుడి ప్రాంత ప్రజలు ఎస్ కే. రఫీ, ఇడిగోటి జగన్, పొదిలి వెంకన్న, బోయపల్లి శంకర్, గొరిబీ, ప్రవీన్, రహీం, నరసింహ, ముత్యాలు, హసీనా, జావిద్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.