–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండా శ్రీశైలం
–నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ కు వినతి
CPM Mudireddy Sudhakar Reddy : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : జిల్లావ్యాప్తంగా పంట ఎండిపోయిన వరి,మిర్చి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ (ఎం) నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల మునుగోడు, దేవరకొండ,మిర్యాలగూడ, నకిరేకల్,నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రైతుల సాగుచేసిన వరి మిర్చి పంటల కు నీరందక ఎండిపోయాయన్నారు.
ప్రైవేటు వడ్డి వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థిక నష్టాలకు గురయ్యారన్నారు.వెంటనే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులచే గ్రామాల్లో సర్వే చేయించి ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.35 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతు సంఘం, సిపిఐ(ఎం) నాయకులు వీరెల్లి వెంకటేశ్వర్లు, అయితరాజ నరసింహ, పాల్వాయి రాంరెడ్డి, సాగర్ల మల్లేష్, చిన్నపరెడ్డి తదితరులు ఉన్నారు.