CPM Sudhakar Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవస రానికి అనుగుణంగా గన్ని బ్యాగు లు అందుబాటులో ఉంచాలని సిపి ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముది రెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశా రు. శనివారం సిపిఎం పట్టణ కమి టీ ఆధ్వర్యంలో ఎస్ ఎల్ బి సి ధా న్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలు సుకున్నారు.
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మా ట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు కావడానికి అ వసరమైన గన్ని బ్యాగులు అంద డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత బ్యాగులు రావడం తో వరి ధాన్యం ఎక్కువ నష్టం జరు గుతుందని అన్నారు. వచ్చిన వెంట వెంటనే కాంటాలు వేసి మిల్లులకు పంపించాలని వాహనాలు సరిపడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవా లని కోరారు.
రైతులకు అవసరమైన మంచినీళ్లు సరఫరా చేయాలని, ధాన్యం తీసు కున్న వెంటనే రైతులకు డబ్బులు అకౌంట్లో వేయాలని డిమాండ్ చే శారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్త య్య పట్టణ కమిటీ సభ్యులు తు మ్మల పద్మ, దండంపల్లి సరోజ, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, సలివొజు సై దాచారి, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, సభ్యులు దండెంపల్లి యాదయ్య మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.