Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM : దోపిడి రహిత సమాజ నిర్మాణమే సిపిఎం లక్ష్యం

–వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి సిపిఎం లోకి రావాలి

–యర్రయ్య -లింగమ్మ ల స్మారక స్తూపం ఆవిష్కరణ సభలో జూలకంటి పిలుపు

CPM :

ప్రజాదీవెన నల్గొండ : నిత్యం పేదల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించిన సిపిఎం నల్గొండ డివిజన్ నాయకులు కాజీరామారం మాజీ సర్పంచ్ కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టి కాలనీ రైతు వేదిక వద్ద మాజీ సర్పంచ్ కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య లింగమ్మ ల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని అన్నారు. ఒక విధానం లేకుండా పూటకో పార్టీ మారి భూస్వాములకు , కార్పొరేట్లకు వంత పాడుతున్న కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించాలని, ఓట్లను నోట్ల ద్వారా కొనాలని దుర్బుద్ధి కలిగిన వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజన నిరుపేద కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ రుద్రాక్షి యర్రయ్య కమ్యూనిస్టుగా ప్రజలలో నిరంతరం పనిచేసిన నాయకుడని కొనియాడారు. సర్పంచిగా గ్రామంలో రోడ్లు మంచినీరు తదితర సౌకర్యాల కోసం పేదలకు ఇండ్ల స్థలాలు, బంచరాయి భూములకు పట్టాలు ఇప్పించడం జరిగిందని కొనియాడారు.

సిపిఎం డివిజన్ నాయకుడిగా వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం గ్రామంలో సిపిఎం నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఓర్వలేని నరహంతక గుండాలు 1991లో ఇంటి మీద దాడి చేసి బాంబులు వేసి చంపారని అన్నారు. వారి ఆశయం దోపిడీ లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేశాడని దానికోసం వివిధ కారణాలతో పార్టీని వీడిన వారందరూ తిరిగి సిపిఎం చేరి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ పేదల సమస్యలను పక్కనపెట్టి కార్పొరేట్లకు వంత పాడుతున్న ఈ పాలక పార్టీల విధానాల వలన నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేర్లతో ప్రజల మధ్య చీలికలు తీసుకువచ్చి తమ పబ్బం కడుక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామ్రేడ్ రుద్రాక్షి యర్రయ్య చూపిన మార్గంలో కూలి, భూమి పోరాటాల్లో పాల్గొనడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. పానగల్లు కత్వ నుండి రామారం వరకు ఉన్న రోడ్డుకు రుద్రాక్ష యర్రయ్య మార్గం అని నామకరణం చేయాలని, 3వ వార్డు ఎస్టీ కాలనీ కి రుద్రాక్ష యర్రయ్య నగర్ గా పేరు మార్చాలని అన్ని పార్టీల నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.

సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, నన్నూరి వెంకటరమణారెడ్డి, చింతపల్లి బయన్న, నలగొండ, తిప్పర్తి మండల కార్యదర్శి లు నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, మాజీ జెడ్పీటీసీ పాలకూరి పద్మ, మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా, పట్టణ, మండల కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, భీమగాని గణేష్, కోట్ల అశోక్ రెడ్డి, గుండాల నరేష్, బొల్లు రవీందర్, ఉప్పల గోపాల్, ఆకిటి లింగయ్య, పోకల శశిధర్, కోట సైదులు, కుటుంబ సభ్యులు శాఖ కార్యదర్శి రుద్రాక్షి రామచంద్రయ్య, జ్యోతిబస్, యాదయ్య, దుర్గయ్య , వెంకయ్య, తిలక్ , శేఖర్, నకరేకంటి జానయ్య, సైదులు బూర జానయ్య , పేరం రామస్వామి, దండెంపల్లి సైదులు, కళాకారులు నకేరేకంటి సైదులు, పాటల గోపి, సల్వాది సైదులు, దొనకొండ రవికుమార్, రామారం, తానేదారుపల్లి, అల్లిగూడెం, ఎస్టీ కాలనీ, శేషమ్మ గూడెం, సందనపల్లి గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.