–రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
Chaya Someswara Temple Preservation : ప్రజాదీవెన నల్గొండ : ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం ఆమె నల్గొండ సమీపంలోని పానగల్ లో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఛాయా సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రత్యేకత పై ఏమైనా సాహిత్యం ఉంటే ఇవ్వాలని అడిగారు.దేవాలయ చరిత్ర ను తెలుసుకున్న ఆమె దేవాలయ ప్రాముఖ్యతను, అదేవిధంగా శిల్ప విశిష్టత, చరిత్ర అన్నింటిని భద్రపరిచేలా చూడాలని ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, అలాగే ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో అన్నారు.
ఆలయ అర్చకులు ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆమె దేవాలయంలో ఉన్న కొనేరును సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.