CPS job teachers: తీన్మార్ మల్లన్నకే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల మద్దతు
ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు(Graduate MLC by-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna ) అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ తన సంపూర్ణ మద్దతును రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రకటించింది
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు(Graduate MLC by-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna ) అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ తన సంపూర్ణ మద్దతును రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రకటించింది. ఈసారి ఉప ఎన్నిక ల్లో చింతపండు నవీన్ బలపరు స్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు స్థితప్రజ్ఞ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
తదనగుణంగా సీపీఎస్ ఉద్యోగ,ఉపాధ్యాయ కుటుంబాల పట్టభద్రులు తప్పకుండా సీపీఎస్ రద్దు -పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేసే మల్లన్న ను మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించా లన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో చని పోయిన సిపిఎస్ ఉద్యోగి కుటుం బానికి ఫ్యామిలీ పెన్షన్ పత్రాలను కుటుంబసభ్యుల కు రాష్ట్ర అధ్య క్షులు స్థిత ప్రజ్ఞ చేతుల మీదుగా అందించారు.
సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్(Family Pension of CPS Employees) లో ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి , కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ఫ్యామిలీ పెన్షన్ ను సీపీఎస్ ఉద్యోగుల ఉండేలా ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. సీపీఎస్ ఉద్యోగి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(CPS Employee Contributory Pension Scheme) సమస్య నే కాక ఎదుర్కొనే ప్రతి సమస్యలు సర్వీస్ సంబంధిత సీపీఎస్ సంఘ మే పరిష్కరించాలని తీర్మా నించా రు.వచ్చే జూన్ మాసం నుండి రెండు నెలల్లో సంఘ సభ్యత్వం పూర్తి చేయాలని తీర్మానించారు.ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు, కోశాధికారు లు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.
CPS job teachers supported Tinmar Mallanna