–ఆరేళ్ల చిన్నా రిపై లైంగిక దాడి, హత్య ఘటన దురదృష్టకరం
–రాష్ట్ర మంత్రు లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీత క్కలు
crime case : ప్రజా దీవెన, పెద్దపల్లి: అత్యంత హృదయ విదారకమైన ఆరేళ్ల చి న్నారిపై (girl) లైంగిక దాడితో పాటు హత్య చేసిన ఘటన దురదృష్ట కరమని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్కలు వ్యాఖ్యానించారు. పెద్ద పెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లోని రైస్ మిల్లులో జరిగి న ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారిపై బీహార్ కు చెందిన వ్యక్తి లైంగిక దా డికి పాల్పడడంతో పాటు కిరాతకం గా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరపడంతో పాటు అతి కిరాతకం అన్నారు. సంఘటన సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోని నింది తుడిని అదుపులోకి తీసుకున్నారని అయి తే అప్పటికే చిన్నారి మృతి చెంద డం బాధాకరమన్నారు. సంఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revnath reddy) స్పం దించి నిందితుడిని వెంట నే పట్టు కోవడంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించారన్నారు. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా పోలీ సులు (police) చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ కార్య క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, పెద్దపల్లి, రామగుండం శాసనసభ్యు లు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ తో తదితరులు పాల్గొన్నారు