Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Crime : తాళం వేసిన ఇళ్లలే వీళ్ళకి టార్గెట్

Crime : ప్రజాదీవెన, నల్గొండ : క్రైమ్ అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనలు చేస్తూ వాటి పై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లలల్లో దొంగతనాలకి పాల్పడుతున్న నలుగురు అంతర్ దొంగలు అరెస్ట్ వీరి వద్ద నుండి 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి,04 బైక్ లు, ఒక లెనోవా ట్యాబ్ .

నిందితుల వివరాలు.

1) కొడావత్ విక్రమ్ వికీరి తండ్రి శంకర్, వయస్సు:21 సంవత్సరాలు, వృత్తి:ఆటో డ్రైవర్, గ్రామం, నామ నాయక్ తండా, H/o పసునూరు నాంపల్లి మండలం. నల్లగొండ జిల్లా. ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా.

2)వడ్త్య నాగరాజు చింట, తండ్రి గోపాల్, వయస్సు20 సంవత్సరాలు, వృత్తి, పెయింటింగ్, గ్రామం దంజిరాల్ తండా, మల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా. ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా.

3)ధనావత్ సందీప్ నాయక్ శాండీ తండ్రి శ్రీను, వయస్సు :24 సంవత్సరాలు, వృత్తి:ఎలక్ట్రిషన్, గ్రామం:కాల్వ తండా, మిర్యాలగూడ మండలం, నల్లగొండ జిల్లా. ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా.

4)జరుప్లా నవీన్ కుమార్@ ముజ్జు తండ్రి హరి,వయస్సు19 సంవత్సరాలు. వృత్తి ఆటో డ్రైవర్, గ్రామం తుంబాయి తండా, సంస్థాన్ నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగ౦గా మరియు ఆస్తి సంబందిత నేరాలను అరికట్టుట లో మరియు చేధించుట లో భాగంగా నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఎస్ ఐ నార్కెట్ పల్లి మరియు సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫి కి దగ్గరలో ఉదయం అందాజా 06:00 గంటల సమయములో నిందితులు నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల ఉన్న మహాత్మా గాంధీ యునివర్సిటి మరియు కామినేని కాలేజి స్టూడెంట్స్ కు మరియు అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు నార్కెట్ పల్లి ఎస్ ఐ డి.క్రాంతి కుమార్, వారి సిబ్బందితో యుక్తముగా నార్కెట్ పల్లి గ్రామ శివారు లో మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో వెళ్ళి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పట్టుబడి చేసి వారిని విచారించగా అట్టి నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ లో దూల్ పేటలో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాయిని తీసుకొని నార్కెట్ పల్లి కి దొంగిలించిన ద్వి చక్ర వాహనాలపై వచ్చినారు.

 

అట్టి గంజాయిని నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో గంజాయి తాగే వారికి నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజి స్టూడెంట్స్ కు మరియు అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయిని చిన్న చిన్న పాకెట్ల లో తయారు చేసి అమ్మాలని ప్రయత్నిస్తుండగా నార్కెట్పల్లి గ్రామ శివారులో మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో నార్కెట్ పల్లి పోలీసు వారు పట్టుబడి చేసి నిందితుల వద్ద నుండి 2 కే‌జి ల మరియు 4 ద్విచక్ర వాహనాలు మరియు 1 లేనోవా టాబ్ లను స్వాధీనం చేసుకోనైనది. ఇట్టి నేరంలో వారి పై Cr.No.19/2025 U/s 8 (C) 20(b)(ii)(B), 29 of ఎన్ డి పి ఎస్ యాక్ట్ -1985 ఆమెండమెంట్ యాక్ట్ 2001 ప్రకారంగా నార్కెట్పల్లి పి ఎస్ నందు కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చనైనది.

 

వీరి పై గతం లో, వీరు మైనర్ గా ఉన్న సమయం నుండి గంజాయి కు అలవాటు పడి దొంగతనలు చేస్తూ ఉండటం తో హయత్ నగర్, ఎల్ బి నగర్, యాచారం,చౌటుప్పల్, సరూర్ నగర్, అచ్చంపేట, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్కేసర్, ఆదిబట్ల, త్రిపురారం, నాచారం, కొండమల్లేపల్లి, దేవరకొండ, ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లల్లో సుమారు ఏ-1 పై 20 కేసులు, ఏ-2 పై 11 కేసులు ఏ-3 పై 23 కేసులు ఏ-4 పై 09 కేసులల్లో నిందితులుగా వుండి అరెస్టు అయ్యి జైల్ కి వెళ్లొచ్చారు. అయిన వారి ప్రవర్తనలో మార్పు రాక, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తాము అనుకున్న పథకం ప్రకారముగా గంజాయి విక్రయించడంతో పాటు ఒక ఇనుప రాడ్డు సహాయముతో రాత్రి సమయంలో తాళం వేసి వున్న ఇండ్లను లక్షంగా చేసుకొని తాళం పగులగొట్టి, తాళం పగలగొట్టడం తో పాటు ద్విచక్ర వాహల దొంగతనాలకి పాల్పడుతున్నారు.ఇట్టి కేసును నల్గొండ డీస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి సీఐ నాగరాజు ఆద్వర్యంలో నార్కెట్ పల్లి ఎస్సై . క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది ఏఎస్ఐ ఆ…