సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దారుణ హత్య
Crimemurder: ప్రజా దీవెన,సికింద్రాబాద్: సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గుర య్యారు. మృతుని రాళ్ల తో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండ గులు.రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తుల మధ్య జరిగిన ఘర్ష ణ ఓ వ్యక్తి దారుణహత్య కు దారితీసిందని తెలుస్తుంది. రాళ్లతో వి చక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
మృతుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉందని, మెడలోకి కూడా ఆంజనేయస్వామి లాకెట్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించా రు.సికింద్రాబాద్ రైల్వే జి అర్ పి పో లీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దే హాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.