Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Criminal laws: జూలై 1 నుంచే కొత్త క్రిమినల్ చట్టాలు ..!

Criminal laws

–అమల్లోకి రానున్న కొత్త పేర్లతో మూడు చట్టాలు
–దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతం కోసమే చట్టాలు
–కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి

Criminal laws: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (Criminal laws) ‘భారతీయ న్యాయ్ సంహిత’, ‘భారతీయ సుర క్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అభి నయం’ ఈ ఏడాది జూలై 1 (july ) నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడించారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పు జరిగిందని, త గిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు.

మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రా ల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చె ప్పారు. ఇందుకు అసవర మైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ (Bureau of Police Research) అండ్ డవలప్‌మెంట్ అంది స్తుంద ని చెప్పారు. జ్యుడిషియల్ అకాడ మీలు, నేషనల్ లా యూని వర్శిటీ లకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచే సేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ (Minister Meghwal) తెలిపారు.

ఇదిలా ఉంటే భారతీయనా గరిక్ సురక్ష సింహత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడి గించనున్నారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు (ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా) ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్ లు (532 Sec) ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లు లో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్‌ సెక్షన్లు చేర్చారు. భారతీ యసాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్ల ను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు ఉండ గా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవి జన్లను బిల్లు నుంచి తొలగించారు. ముఖ్యమంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతి రేకం గా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకువచ్చారు.