Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cruelty for the egg curry: కోడిగుడ్డు కూర కోసం క్రూరత్వం

--భార్యను దారుణంగా చంపిన భర్త

కోడిగుడ్డు కూర కోసం క్రూరత్వం

భార్యను దారుణంగా చంపిన భర్త

ప్రజా దీవెన/ జగిత్యాల: దసరా సరదా తీరకముందే వారి జీవితంలో విషాదం నెలకొంది. దసరా పoడుగ పూట దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫుల్ గా దసరా ధావత్ చేసుకొని వచ్చిన భర్త కోడి గుడ్డు కూర వండలేదని తన భార్యను కిరాతకంగా హత్య చేసాడు. హృదయ విదారకమైన ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

పట్టణంలోని టీఆర్ నగర్‌లో నివాసముంటున్న కట్ట సంజయ్, సుమలత దంపతులకు పండుగ రోజున గొడవ జరుగడంతో పాటు దసరా పండుగ వేళ మద్యం తాగిన సంజయ్ కోడిగుడ్డు కూర ఎందుకు చేయలేదంటూ సుమలతతో గొడవ పెట్టుకున్నాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో తీవ్ర కోపోద్రిక్తుడై భార్యపై దాడి చేశాడు. విచక్షణ కోల్పోయిన సంజయ్ భార్య గొంతు నుమిలి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకున్న ధర్యాప్తు చేస్తున్న పోలిసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. స్థానికులు అందించిన వివరాల మేరకు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.