Cyber Crime: ప్రజా దీవెన,కోదాడ: విద్యార్థులు సైబర్ నేరాలు, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు పోలీసు అధికారులు తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలోని నారాయణ పాఠశాలలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు సోషల్ మీడియా, సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి వాటిపట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, తమ ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని అదేవిధంగా ఓటిపిలు అనవసరమైన లింకులను ఓపెన్ చేయకూడదని సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యువత గంజాయి డ్రగ్స్ మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలన్నా…