— 15 నెలలో అద్భుత ప్రగతి, అక్ర మార్కులపై ఉక్కుపాదం
— రూ. 409 కోట్ల విలువైన బి య్యం స్వాధీనం
–ఐఐఎం సదస్సులో పౌరసరఫరా ల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహాన్
D.S. Chauhan : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో ఏడాదిన్నర కాలంగా పౌరసరఫ రాల శాఖలో చేపట్టిన సంస్కరణ లు దేశానికి ఆదర్శంగా నిలిచాయ ని పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహాన్ అన్నారు. పౌరసరఫరాల విభాగా న్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు చేరువ చేశామని , ప్రజా పంపిణీ ద్వారా పేదలకు నాణ్యమైన సరు కులను సకాలంలో అందించడమే కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా ధాన్యం కొనుగోలు జరుపుతున్నామని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మరియు సిఎంఆర్ ఎగవేసిన మిల్లర్లపై ఉక్కు పాదం మోపుతున్నామని, గత 15 నెలల్లో రూ. 409 కోట్ల విలువచేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లోని ఐఐఎంలో జరిగిన అంతర్జాతీయ నాయకత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ చౌహాన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 15 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో చేపపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలను వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతమేరకు వినియోగించుకొని అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, వంద శాతం రూట్ ఆప్టిమైజేషన్ మైలురాయిని సాధించి తెలంగాణ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిందని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 12 నుంచి 15 కోట్లు ఆదా అవుతుందన్నారు.
పేదప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి వీలుగా రేషన్ పంపిణీ కోసం ఆధునిక చౌక ధరల దుకాణాల (జన్ పోషణ్ కేంద్ర) అమలు మరియు ఈ-పాస్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందన్నారు.
వరి ధాన్యం సేకరణలో వాతావరణ అంచనా సాంకేతికతను (Weather Forecast Technology) దేశంలోనే తెలంగాణ తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని, దీనివలన రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ప్రభుత్వ బియ్యాన్ని (సిఎంఆర్) మిల్లర్ల నుంచి గడువులోగా సేకరిస్తున్నామని , గతంలో బియ్యాన్ని ఎగవేసిన సిఎంఆర్ డిఫాల్టర్లు మరియు బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం వలన రూ. 409 కోట్ల విలువైన బియ్యం రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. పిడిఎస్ బియ్యం జప్తు కేసులు 9 రెట్లు పెరిగాయని అన్నారు. నాణ్యమైన తెలంగాణ బియ్యం ఎగుమతి కోసం ఫిలిప్పీన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం జరిగిందన్నారు.
ప్రతినెలా తెలంగాణ ప్రభుత్వం 17వేల రేషన్ షాపుల ద్వారా 89. 52 లక్షల కుటుంబాలకు 1లక్షా 81 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ఈ బియ్యం నాణ్యత సరిగా లేకపోవడం వల్ల పేదలు బియ్యం తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని ఏడాది కాలంగా బియ్యం నాణ్యతను పూర్తి స్దాయిలో మెరుగపరచడం జరిగిందని క్షేత్రస్ధాయిలో సిబ్బంది రాజీ పడకుండా నాణ్యమైన బియ్యాన్ని మిల్లర్లనుంచి తీసుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యాన్ని సరఫరా చేయబోతున్నామని ప్రకటించారు.
కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు, సాంకేతిక పర్యవేక్షణ మరియు రైతు-ఆధారిత చర్యలతో సహా ఆయన అమలు చేసిన సాహసోపేతమైన విధాన పరమైన మార్పులు పౌర సరఫరాల రంగంలో దేశ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఏప్రిల్ 2025 నుండి ప్రజా పంపిణీ వ్యవస్థలో బలవర్థకమైన సన్న బియ్యం (ఫోర్టిఫైడ్) ప్రవేశపెట్టడం వంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమలు చేయడం ద్వారా ఆహార నాణ్యతను పెంపొందించడము విషయములో మరియు రైతుల శ్రేయస్సు పట్ల ఆయన నిబద్ధతను మరింత నొక్కి చెబుతాయి.