దళిత బంధు సాధనకై నిరసన ర్యాలీలో పాల్గొనండి
Dalithabandhu : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: రెండో విడత మంజూరైనా దళిత బం ధు నిధులను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన నలగొండ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవనం నుం డి క్లాక్ టవరు మీదుగా అంబేద్క విగ్రహ భాస్కర్ టా కీస్ వరకుజరిగే నిరసన ర్యాలీలో లబ్ధిదారులు అధిక సంఖ్యలో పా ల్గొనాలని దళిత నాయకులు బొర్ర సుధాకర్ కుల వివక్ష వ్యతిరేక పో రాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు.
బుధవారం స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన పత్రికా వేలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభు త్వం ద్వారా నల్గొండ ని యోజకవర్గం లో ప్రొసీడింగ్స్ ఇచ్చి మంజూర అయ్యి న 1050 మం ది నిరుపేద దళితుల లబ్ధిదారుల ఖాతాలో మూడు లక్షల రూపా య లు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ వలన నిలి పి వేశారని తిరిగి కోడ్ ముగిసినందున కేటాయించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గల్లో ఇటీవల విడుదల చేశారాని అన్నా రు. మాపైన ఎందుకు ఇంత వివక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు. లేని యెడల చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని, లబ్ధిదారులు కుటుంబాలు ఆమరణ నిరహర దీక్షకు పునుకుంటామ ని తెలిపారు. ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీలో ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం లో దళిత నాయకులు కందుల లక్షమయ్య, బడుపుల శంకర్ పాల్గొ న్నారు.