Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Damodar Rajanarsimha: బోరంచ ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామల

Damodar Rajanarsimha: ప్రజా దీవెన, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజక వర్గం బోరంచలో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడు, మనూర్ మండలాల్లోని బీసస్యశ్యా మలం అవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. సోమ వారం బోరంచలో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ఫీల్డ్ గ్రావిటీ కాలవల పనులకు మంత్రి దామో దర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, నారాయ ణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.

బోరంచలో మొదటగా మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి లు జిల్లాలోని ప్రధాన దేవాలయమైన బోరంచ నల్ల పోచమ్మ దేవాలయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ పూజారులు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలకు (Minister, MLA, MP) పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంజీరా నదిపై ఆలయ సమీపంలో నిర్మించనున్న బోరంచ ఎత్తిపోతల పథకం ఫీల్డ్ గ్రావిటీ మెన్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు . రూ.430.50 లక్షలతో నిర్మించనున్న ఫీల్డ్ మెయిన్ గ్రావిటీ ద్వారా మనూరు మండలంలో బోరంచ, టి లింగంపల్లి, తాటిపల్లి, సింధు గ్రామాలలో చెరువులు నింపడం ద్వారా 2900 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. రు.259 లక్షలతో నిర్మించనున్న ఫీల్డ్ మెయిన్ గ్రావిటీ ద్వారా రేగోడు మండలంలోని రేగోడు, చౌటుపల్లి, మరుపల్లి, కొత్వాలపల్లి గ్రామాలలో చెరువులు నిందింపడం ద్వారా సుమారు 500 ఎకరాలకు సాగునీరందరున్నట్లు తెలిపారు.

అనంతరం పంపు హౌస్ ను పరిశీలించి మోటర్ స్విచ్ ఆన్ చేసారు.ఈ రెండు ఫీల్డ్ మెయిన్ గ్రావిటీల (Field main gravities) ద్వారా 3400 ఎకరాలకు సాగునీరు అంది ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు.ఇక్కడి పొలాలకు తగినంత నీరు అందడంతో స్థానిక రైతులకు బంగారు పంటలు పండే అవకాశం కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధి గ్రామాల ప్రజలు , రైతుల ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని మంత్రి తెలిపారు. ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ పద్ధతులు మెరుగుపడతాయి, దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. తద్వారా రైతులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మంత్రి తెలిపారు. బోరంచ ఎత్తిపోతల (Borancha will lift up) పథకం ద్వారా పంటలకు తగినంత నీరు అందుతుందని స్థానిక రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అశోకచక్రవర్తి, డి ఎస్ పి వెంకట్ రెడ్డి, డి ఈ జలెందర్, ఏ ఈ విధ్యావతి, తహసీల్దార్ వెంకట స్వామి, ఈ ఈ విజయ కుమార్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు.