Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Damodara Raja Narsimha: మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ లక్ష్యం

— రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజ నర్సింహ

ప్రజా దీవెన, నిజామాబాద్: ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ప్రారం భించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదు పాయాలను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అత్యు న్నతమైన విద్య, వైద్యం, సామాజి క భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకు సాగు తున్నామన్నారు.

ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల అవస రాలకు అనుగుణంగా ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు, సామా జిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రు లను ఏర్పాటు చేయడంతోపాటు పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మరో 300లకు పైగా ఆరోగ్య ఉపకేంద్రాలు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పా టు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు.గిరిజన ప్రాంతా లతోపాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపా రు.

అత్యవసర సమయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికి త్స అందాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఇటీవల 213 కొత్త అంబులెన్సులను ప్రజలకు అంకి తం చేసిందని గుర్తు చేశారు. మరో 85 వరకు అంబులెన్సులు అందు బాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు 102 అమ్మఒడి వాహనాలను కూ డా సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపా డేందుకు జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామ న్నారు. వాటికి అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తామని తెలి పారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాలతోపాటు వాస్కులర్ యాక్సెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ పేద ప్రజలు వైద్య సేవల కోసం అప్పులు చేయకుండా, అభద్రతా భావానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మెరుగైన వైద్యం పొందేందుకు వీలుగా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చామని మంత్రి తెలిపారు. అదనంగా ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, ఫుడ్ ఇన్ స్పెక్టర్లను కొత్తగా నియమిస్తున్నామని వివరించారు. అవసరమైన చోట ఐవీఎఫ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజా సంక్షేమం, ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్యులు -కార్యక్రమంలో కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.