–శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రజా దీవెన,సంగారెడ్డి: ప్రజా సంక్షే మం అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కృతనిశ్చయంతో పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన ర్సింహ (Damodara Rajanarsimha) పేర్కొన్నారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు. శుక్రవారం సంగా రెడ్డి జిల్లా (sangareddy) పటాన్ చెరు నియో జకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రూ.8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha), మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెల్లాపూర్ మునిసి పాలిటీలో అర్భన్ హెల్త్ సెంటర్ నిర్మాణం 15 రోజుల్లో మొదలు పెడతామని మంత్రి హమీ ఇచ్చారు. చెరువులను,కుంటలను కాపాడుకో వాలని లేదంటే భవి ష్యత్తు తరాల కు మనుగడ ఉండ దని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతిపనిలో ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం కార్యాలయం ఆవరణ లో ఏర్పాటు చేసిన జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.