–రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క
Danasari Anasuya Sitakka: ప్రజా దీవెన, ములుగు: గ్రామాలను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Sitakka) పేర్కొన్నారు.ఆదివారం వెంక టాపూర్ (Venka Tapur Mandal)మండలం పాపయ్యపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామపంచాయితీ భవనంను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తొ కలసి ప్రారంభిం చారు.అనంతరం గ్రంథాలయం ను మంత్రి ప్రారంభిం చారు.ఈ సంద ర్భంగా మంత్రి సీతక్క (Sitakka) మాట్లాడు తూ గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం పెండింగ్లో ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురా వాలని, రెండు కోట్ల 15 లక్షల రూపాయల నిధులతో పాలంపేట రోడ్డు మరమ్మత్తులు చేయడం జరుగుతుందని, స్మశాన వాటిక నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
మంచి, చెడు, ప్రజల అవసరాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించుటకు కృషి చేస్తానని మంత్రి (Sitakka) ఆన్నారు.ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక మహిళలకు మంత్రి సీతక్క (Sitakka) రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అందరూ ఆడబిడ్డల్ని గౌరవిస్తూ రక్షిస్తూ వారికి అండగా నిలుస్తూ అన్ని రంగాలల్లో వారికి ప్రోత్సాహం కల్పిస్తూ ఎదగనివ్వాలని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అనేక గ్రామాలలో చాలా సంవత్సరాల క్రితం కొంతమంది దాతలు తమ భూమిని విరాళంగా ఇచ్చి గ్రామపంచాయతీ భవనాలు, ఆస్పత్రులు, (Gram panchayat buildings, hospitals,) ఇతర ప్రభుత్వ భవనాల నిర్మించుటకు ఇచ్చి ప్రజల మనుషులను గెలుచుకునే వారని కానీ నేడు ఈ కాలంలో కూడా గ్రామ పంచాయతీ భవనం నకు భూమీ విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరమని, గ్రామం లో సొంత నిధులతో భూమి తో పాటూ భవనం నిర్మించి గ్రంథాలయం( Libraryఏర్పాటుచేసి బహుమానంగా విరాళంగా ఇచ్చిన తూడి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రంథాలయం (Library) గ్రామంలో అనేక మంది యువతకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, సి ఈ ఓ సంపత్ రావు, పంచాయితి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డిడబ్లుఓ స్వర్ణ లత లీనినా, ఎం పి డి ఓ, ఎం పి ఓ, గ్రామ పంచాయతీ ప్రత్యెక అధికారి, కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, స్థల, భవన నిర్మాణ దాతలు, తూడి రవీందర్ రెడ్డి, సుకేందర్ రెడ్డి,మహేందర్ రెడ్డి, మందల లక్ష్మి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.