–రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి దనసరి అనసూయ సీతక్క
Danasari Anasuya Sitakka: ప్రజా దీవెన, ములుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం (Papanna Goud’s life) అం దరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పు డూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణ అభి వృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆది వారం ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరం లో సర్దార్ సర్వాయి పా పన్న గౌడ్ 374 వ జయంతి ఉత్స వాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Danasari Anasuya Sitakka)పాల్గొ ని, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తొ కలసి శ్రీ సర్దార్ సర్వాయి పాప న్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Danasari Anasuya Sitakka)మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయం తి ఉత్సవాలను అధికారి కంగా జరపడం చాలా సంతోషక రమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగ డకు భవిష్యత్తు కష్టతరం అవుతుం దని ,నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు, జనం కోసం పనిచే స్తే జనంలో ఉండిపోతావని అన్నా రు.సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మ డి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతం లోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల (cattle) కాపరిగా ఉం టూ రాజుల సైన్యాలను వారి ఆగడా లను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడార ని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆద ర్శమని పేర్కొన్నారు.
సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.జిల్లా కలెక్ట ర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకో వలసిన అవసరం ఉందని ఒక మామూలు మనిషి తన కళ్ళ ముం దు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదురించాలని ఉద్దేbశంతోనే తనతో ఎలాంటి సైన్యం లేకున్నా ఆస్తి అంతస్తులు (Property floors) లేకున్నా అప్పటి ప్రభువులు అధిక పన్నులు వసూలు చేస్తుంటే వారిని ఎదిరించి దాదాపు అనేక కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.రాజులు రాజ్యాలు అంతరించిన అనంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నేటికీ ప్రజలకు సమస్యలు ఎదుర వుతే స్థానిక అధికారులకు తెలి యజేయాలని లేదా రాజ్యాంగ బద్ధంగా ప్రజలు అధికారులను ప్రశ్నించవచ్చని తెలిపారు.
స్థానిక గౌడన్న సమస్యలను తమ పరిధిలో ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించ డం జరుగుతుందని అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలు మంత్రి (minster)అందచేశారు.అనంతరం కలెక్టర్ కు మంత్రి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సి ఈ ఓ సంపత్ రావు, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, బి.సి. కులస్థులు, బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.