ప్రజా దీవెన, హనుమకొండ:ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బి. ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఢీల్లి లోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కాజిపేట్ సమస్యలపై కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అనేక సార్లు అన్ని వర్గాల ప్రజలతో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించాకున్నమని ఈ తరుణంలో ఈ పార్లమెంట్ సమావేశాలలోనే విధి విధానాలు ప్రకటించాలని అలాగే కాజీపేట జంక్షన్ ను డివిజన్ గా మార్చాలని రైల్వే స్ట్రీట్ వెండర్స్ కు స్టేషన్ ముందు స్థలం లో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలి.
అలాగే రైల్వే స్టేడియంలో బస్టాండ్ స్థలాన్ని కేటాయించాలి బోడగుట్ట ప్రజలకు ఫుటోవర్ బ్రిడ్జినిర్మించాలని కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీప్ విప్ బి ఆర్ యస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చెశారు ఈ సమస్యలను ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రకటించాలని లేని యెడల అన్ని వర్గాల ప్రజలతో గల్లీ నుండి ఢిల్లీ దాక పోరాటంను ఉదృతం చేస్తామని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ 47 వ డివిజన్ బి ఆర్ యస్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ శిరుమల్ల దశరథం 47వ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనుకరాజ్ MD ఆఫ్జాల్ కోండ్ర శంకర్ MD హుస్సేన్ సుంచు అశోక్ బరిగేల వినయ్ రాబర్ట్ జోసఫ్*