ప్రజా దీవెన, శాలిగౌరారం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుడు కామ్రేడ్ పలస బిక్షం ఆశయం సాధన కోసం కృషి చేయాలని సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసి రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ పలస బిక్షం 19వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దేవరకొండ అల్లయ్య అధ్యక్షతన శాలిగౌరారం మండ లం పెర్క కొండారం గ్రామంలో బుధవా రం రాత్రి బహిరంగ సభ జరిగింది.
ఈ సభ కు ముందు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి స్మారక స్తూపం వద్ద అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సభలో ముక్యవక్తగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం. డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ…కామ్రేడ్ పలస బిక్షం నిజాం నవాబు పాలన నుండి నరహంతక చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాలనల వరకు పీడితుల పక్షాన నిలబడి పోరాటం చేశాడని అన్నారు. దున్నే వానికే భూమి నినాదాలతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను నిర్మించి వందలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టాడని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం, రాజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఆయుధాలు అందించి తిరుగుబాటు చేయించిన చరిత్ర పల్స బిక్షం ఉందని అన్నారు.
చిన్న ప్రాయంలోనే కమ్మునిస్ట్ ఉద్యమాలకు ఆకర్షితుడై అనేక నిర్భధాలు, దాడులు, జైలు జీవితాలను అనుభవించాడని కొనియాడారు. జీతగాళ్ల సమ్మె, కూలీ రేట్ల పెంపు, సారా వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. గ్రామ సర్పంచిగా, ఎం.పీ.టీ.సీ గా, నకిరేకల్ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని అన్నారు. కామ్రేడ్ పల్స బిక్షం జీవితం నేటి యువతకు ఆదర్శం అని అన్నారు.
దేశంలో, రాష్ట్రంలో పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, ప్రజలను, కులాలు, మతాల పేరిట విభజించి పాలిస్తున్నారని అన్నారు. ప్రజలపై రోజురోజుకు పన్నుల భారాలు మోవుతున్నారని అన్నారు.
ఈ సభలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదయ్ గిరి, పివైఎల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బి.వి చారి, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పవన్,ఐ.ఎఫ్.టి.యూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు మాట్లాడగా, గ్రామ నాయకులు వేముల శంకర్, దేవరకొండ జానయ్య, బొల్లెపల్లి వెంకన్న, అరుగు అంజయ్య, శంబులు, సిలువేరు జానయ్య, రావుల లింగయ్య, ఏమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గండు నగేష్, తదితరులు పాల్గొన్నారు.