–అధికారంలోకి రాగానే 42% రిజ ర్వేషన్లతో బీసీలకు న్యాయం
–ఎస్సీ వర్గీకరణ అమలు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
–ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతా వత్ శంకర్ నాయక్
DCC Ketawat Shankar Nayak : ప్రజా దీవెన, నల్లగొండ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీతోనే సమస్త వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతా వత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమో దం తెలపడంతో హర్షం వ్యక్తం చే స్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షు డు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వ ర్యంలో బుధవారం నల్గొండ పట్ట ణంలో సంబరాలు నిర్వహించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యా లయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించా రు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎ త్తున బాణాసంచా కాల్చారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లా డుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ డుగు,బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నా రు.రాహుల్ గాంధీ ఆదేశానుసారం ‘మేం ఎంతో మాకు అంత’ అన్న విధంగా బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కు తుందని అన్నారు. దేశంలో మొట్ట మొదటిసారి ఎస్సీ వర్గీకరణకు శా సనసభలో ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీక రణపై మోసం చేశారని విమర్శిం చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుం దని పేర్కొన్నారు. శాసనసభలో బీసీల రిజర్వేషన్ 42 శాతం, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో ఇకనుంచి ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడంతోనే నాలాంటి సామా న్య కార్యకర్తకు ఎమ్మెల్సీగా అవకా శం దక్కిందని ఈ సందర్భంగా శంక ర్ నాయక్ తెలిపారు. పట్టణ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ శాసనసభలో ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడంతో అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మం త్రులు ప్రత్యేక చొరవ తీసుకొని బిల్లులు ఆమోదింప చేశారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి, దామోదరం రాజనర్సింహలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో నల్గొండ మాజీ మున్సిప ల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమే ష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్య క్షుడు బోడ స్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గండి చెరువు వెంకన్న గౌడ్, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువజ న కాంగ్రెస్ నాయకులు దుబ్బ అశో క్ సుందర్,కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షు డు మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరిక హరిప్రసాద్, వజ్జ రమేష్ యాదవ్, నాగేశ్వర్ రావు,కిన్నర్ అంజి, తోల కొప్పుల గిరి, సైదిరె డ్డి,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.