–కళాశాల ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్
BRAOU Admission : ప్రజాదీవెన నల్గొండ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో (2025-26) ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరుటకు ఆసక్తి గల విద్యార్థినిలు కళాశాలలో సంప్రదించాలని కళాశాల ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా మహిళల కోసం ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఈ కళాశాలలో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస రాజు తెలిపారు.
ఇంటర్మీడియట్ పాసై అలాగే రెండు సంవత్సరాల ఐటిఐ, రెండు సంవత్సరాల డిప్లమా, ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు కళాశాల ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసుకోవటానికి అవకాశం ఉందని తెలిపారు. అలాగే చదువు మధ్యలో ఆపేసిన వారు, ఈ దూర విద్యా కేంద్రం ద్వారా తమ డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేయదలచుకున్న విద్యార్థినులు తమ ఎస్ఎస్సి, ఇంటర్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆన్లైన్ సెంటర్లలో ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8919436579, 7382929758 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.