*నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ మహోన్నత వ్యక్తి దొడ్డా నారాయణరావు: కే నారాయణ
Dodda Narayana Rao Death : ప్రజా దీవేన, కోదాడ: తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధులు సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి చిలుకూరు మాజీ ఎంపీపీ దొడ్డ నారాయణరావు నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ మహోన్నత వ్యక్తి కార్యదక్షులు దొడ్డ నారాయణరావు మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమినేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నకరిగంటి సత్యం సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర నాయకులు పశ్య పద్మ లు అన్నారు, దొడ్డా నారాయణరావు శుక్రవారం అనారోగ్యంతో తన నివాసగృహములో మృతి చెందారు.
ఈ సందర్భంగా నాయకులు నారాయణరావు నివాస గృహానికి శనివారం వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలివి తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1940 దశకంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు నాయకుడు దొడ్డ నారాయణరావు అని అన్నారు. ఉమ్మడి నల్లగొండ సిపిఐ జిల్లా కార్యదర్శిగా, నల్లగొండ వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శిగా, చిలుకూరు గ్రామ సర్పంచ్ గా 25 సంవత్సరాలు చేశారని అన్నారు.ఆంధ్ర మహాసభలో వారి సోదరులు దొడ్డ నరసయ్య తో పాల్గొని నాటి నుండి ఆ ప్రాంతంలో భూస్వాములకు జాగిర్ దారి పెత్తందారి దొరల ఆగడాల వ్యతిరేకంగా పోరాడని అన్నార.
నిజం రాచరిక వ్యవస్థకు రజాకార్లకు దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నరనిరజాకార్లకు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుతో సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొని స్వతంత్రానంతరం ఇండియన్ యూనియన్ సైన్యం పోలీస్ దళాలు వెతుకుతూ ఉంటే నల్లమల అడవులలో రహస్య సాయుధ పోరాటం కొనసాగించారని అన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాడని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్సీ నకిరేకంటి సత్యం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర రావు సూర్యాపేట జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు చిలుకూరు మండల కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు నారాయణరావు కుమారులు రమేష్ నరేష్ ,శ్రీధర్ కుటుంబ సభ్యులు దొడ్డా పద్మ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చిలుకూరు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు