Degree Results :ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ 1,3, 5 సెమిస్టర్ల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కళాశాలలదేనని సూచించారు. డిగ్రీ కళాశాలలో విద్యా సౌకర్యాలు మెరుగుపరిచి హాజరు నిబంధనను విధిగా పాటించాలని సూచించారు.
డిగ్రీ మొదటి సెమిస్టర్ లో 6300 మంది విద్యార్థులకు గాను 1338 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, మూడవ సెమిస్టర్ లో 4509 మందికి గాను 1569 మంది, ఐదవ సెమిస్టర్ లో 5378 మందికి గాను 2380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సి ఓ జి డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, అడిషనల్ కంట్రోలర్ డా లక్ష్మీ ప్రభ, డా సంధ్యారాణి, డా రామచంద్ర గౌడ్, డా ప్రవళిక , కోఆర్డినేటర్ డా బిక్షమయ్య పాల్గొన్నారు.