–డివైఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
— అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలి
–డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
Illegal Arrests : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ యువత హక్కుల సాధనకై చలో సచివాలయం ముట్టడినీ పిలుపునిస్తే పోలీసులచే అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. శాంతియుతంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని రాజకీయ జోక్యం లేకుండా రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో సచివాలయ కార్యాలయాన్ని ముట్టడిని పిలుపునిస్తే పోలీసులచే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎన్ని అక్రమ అరెస్టులు నిర్బంధాలు పెట్టిన చలో సచివాలయం ముట్టడికి విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మరింత ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది డి వై ఎఫ్ ఐ నాయకులను అర్ధరాత్రి నుండి అక్రమ అరెస్టు లు చేసారన్నారు. అరెస్ట్ అయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.