* ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది
*బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు
*ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి వంగవీటి రామారావు
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం
జిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్
ప్రజా దీవెన, కోదాడ: బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలుగా నిలుస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు శుక్రవారం కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి కాన్వెంట్లో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న 52వ జిల్లా స్థాయి విద్య బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుందన్నారు ఇటీవల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు 40 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వంగా ఆదర్శంగా నిలిచిందన్నారు.
సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న స్థానం మరి ఎవరికి ఉండదు అన్నారు ఉపాధ్యాయుని రాష్ట్రపతి చేసిన ఘనత భారతదేశం ది అన్నారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే విద్యార్థులు అని రంగాల్లో రాణిస్తారు అన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు అలాగే . జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజు మాట్లాడుతూ కోదాడలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే పద్మావతి కి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజులపాటు జిల్లా నలుమూలల నుండి అన్ని పాఠశాలల నుండి సుమారు 350 కి పైగా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు విద్యార్థులచే ప్రదర్శించబడ్డాయన్నారు కోదాడలో నిర్వహించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన సూర్యాపేట విద్యాశాఖ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు.
విద్యార్థులు ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, సాగర్ ఎడమ కాలవల మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి లు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించారని కొనియాడారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కోదాడలో నిర్వహించి విజయవంతం చేయడం కోదాడ ఎంతో గర్వకారణం అన్నారు. విద్యాసంబంధ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరి సహకారంతో విజయవంతం చేశామన్నారు. గత రెండు రోజులుగా కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు అంకితభావంతో పనిచేసి ప్రదర్శనను విజయవంతం చేసి కోదాడకు జిల్లాలో గుర్తింపు తెచ్చారన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు అనుమతులు ఇప్పించి అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే పద్మావతికి స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పూర్తి పారదర్శకంగా ప్రదర్శనలను ప్రాస స్థాయికి రాష్ట్రస్థాయికి జూనియర్ కళాశాలల అధ్యాపకులను న్యాయ నిర్ణయితలుగా ఏర్పాటు చేసి ఎంపిక చేశామన్నారు జిల్లావ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు వచ్చి ప్రదర్శనలను తిలకించారు ప్రదర్శన విజయవంత అవటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. అనంతరం అతిధుల సమక్షంలో విజేతలకు అన్ని విభాగాల్లో బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు,జిల్లాలోని పలు మండలాల ఎంఈఓ లు సెక్టోరియల్ అధికారులు కమిటీల కన్వీనర్లు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.