DepartmenteMedical : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం గిరిజన ఆదివాసి ప్రజల భవిష్యత్తు తరాల ఆరో గ్యం మెరుగుపరిచేందుకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రధాన మంత్రి జన్మన్ యోజన ద్వారా ప్రధానమంత్రి ఇటీవల కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అందులో అటవీ ప్రాంతంలో మారుమూల గిరిజన తాండాలు పెంటలు చెంచు గుడాలలో ఎరుకలు గుడాలలో నివసిస్తున్న గిరిజనులకు వైద్యం అందించడానికి మార్గం సుగమం చేయడానికి పి.ఎం జన్మన్ యోజ న కింద ప్రత్యేక సంచార వైద్య వాహనం వైద్య ఆరోగ్యశాఖ నల్గొండ ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది.
అట్టి వాహనము బాడుగ, కిరాయి పద్ధతిలో ఏర్పాటు చేసుకొని వై ద్యం అందించాల్సి ఉండగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు ,బడా నా యకులు , వారి వాహనాన్ని జన్మల్ పథకంలో సంచార వైద్య వాహ నం కొరకు నెలసరి అద్దె నిమిత్తం వాహనాన్ని ఏర్పాటు చేసి స్వలా భం కొరకు నామమాత్రంగా వాహనాన్ని పెట్టి వైద్య సదుపాయాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంలను నీట ముంచి పేద గిరిజనులకు ఆదివాసీలకు అందించవలసిన వైద్య సదుపా యం అందకుండా దుర్మార్గమైన దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులు కొల్లగొడుతున్నారు.
ఇట్టి విషయమై లంబాడ హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసి డెంట్ రమావత్ సక్రునాయక్ తీవ్రంగా స్పందించారు. వెంటనే విచా రణ జరిపి సంబంధించిన వారిపై చర్య తీసుకుని ప్రభుత్వ సొమ్ము ను తిరిగి రాబట్టి అధికారులపై తగు చర్య తీసుకుని వెంటనే కొత్త వాహనాన్ని గిరిజనుల చేత కొనుగోలు చేయించి వారికి జీవనోపాధి కల్పిస్తూ మరియు గిరిజనుల యొక్క వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరుచుటకు పునః ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలను జిల్లా కలెక్టర్ ను పత్రిక ముఖంగా కోరినారు.
ఇట్టి విష యంపై విచారణ జరిపి వెంటనే అటి వాహనాన్ని తొలగిం చి గిరిజన నిరుద్యోగులకు ఎవరికైనా ఈ స్కీం నందు వాహనాన్ని ఇ ప్పించి వారి చేత అద్దె,బాడుగ పద్ధతిలో వాహనాన్ని వైద్య వాహనా న్ని పునః ప్రారంభించాలని కోరినారు.