Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM battivikramarka : డేటా ఎంట్రీ లో డోర్ లాక్ వివరాలు సేకరించండి

--డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

డేటా ఎంట్రీ లో డోర్ లాక్ వివరాలు సేకరించండి

— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

ప్రజా దీవెన, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరు కుంటుంది, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదిఎలాంటి పొరపా ట్లకు అవకాశం ఇవ్వకండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆయన జార్ఖం డ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్ట ర్లుకు పలు సూచనలు చేశారు.

డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైనది, ప్రభుత్వం ఈ అంశం పై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమ స్యలు తలెత్తేయీ కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలి యజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారి ని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాం తాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీక రించుకోవాలి అని తెలిపారు.

కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పాఠశాలలో ఆహారం మరియు పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబి నెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈ రకమైన సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపా రు.

ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశా ఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిహెచ్ఎంసి కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గోన్నారు.

Deputy CM battivikramarka