–నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ లో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రా ష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (gs d p) 15.02 లక్షల కోట్లు, వృద్ధిరే టు 14.5%. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తల సరి ఆదాయం 3.56 లక్షలగా ఉందని తెలిపారు. అభివృద్ధి అనే ది కేవలం సంఖ్యల ద్వారా మాత్ర మే కాకుండా రైతులు, సూక్ష్మ , చి న్న, మధ్య తరహా పరిశ్రమలు గ్రా మీణ ప్రాంతాలను ఏ విధంగా అభి వృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నాం అనేదే మెరుగైన ప్రయాణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాదులో జరిగిన నాబార్డ్ స్టేట్ ఫోక స్ పేపర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భా గస్వామిగా ఉందని రాబోయే రోజు ల్లో మరింత ప్రోత్సాహం అందించా లని కోరారు.
రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుంది, భూగర్భ జల వనరులు పెరిగాయి, హైదరా బాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలి, గత పది సంవత్సరాలు సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారు. ఐకెపిల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి . వ్యవసాయ పంపు సెట్లు క్రమంగా సోలార్ పవర్ పంపుసెట్లుగా మా ర్చేందుకు దృష్టి సారించాలి .గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీ డర్ గా నిలపాలని కోరారు.