Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti Vikramarka: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

–గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి
–జిడిపి అధికంగా వచ్చే రంగాల పైన దృష్టి సారించాలి
–వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల

Deputy CM Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరా బాద్: గత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏమిటి, అందుకు గల కారణా లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మల్లు సమావేశంలో వ్యవసాయ అధికారులను (Agriculture officials) కోరారు.

కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వి నియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు (Agriculture Minister Tummala Nageswara Rao)అధికారులకు తెలిపారు. పంటల బీమా లో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వాటాలు. రాబోయే సీజన్ కు పంటల భీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్ల పై చర్చించారు.

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో (meeting) తీసుకున్నా రు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యక లాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో ( Agricultural College)విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం, అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజా నాకు , రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు ప్రభుత్వం తదితర రంగాలపై చేస్తున్న ఖర్చులను డిప్యూటీ సీఎం అధికారుల ద్వారా విచారించారు. ఇక రైతు భరోసా కు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని, రాష్ట్ర వ్యా ప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయా లని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

డ్రిప్ ఇరిగేషన్ కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు. రైతు రుణమా ఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖ ర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగు తున్న బడ్జెట్ పై సమీక్ష చేశారు. ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు.


రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పు లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మల్లు అధికారులను విచారించారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారు తదితర వివరాల ను అధికారులు సమావేశంలో వివరించారు.

సమావేశంలో స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.