Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Mallu Bhatti Vikramarka : మళ్లీ కార్పొరేషన్ రుణాలు

— ఒక్కొక్కరికి రూ.2లక్షల సాయం

— 35 నుంచి 50శాతం వరకు రాయితీ

–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు అవకాశం

— స్వయం ఉపాధి పథకానికి సిద్ధమైన మార్గదర్శకాలు

–లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

— ఏప్రిల్ 14 నుండి అమల్లోకి..!

Deputy CM Mallu Bhatti Vikramarka: ప్రజాదీవెన నల్గొండ ఉమ్మడి జిల్లా బ్యూరో : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక సంవత్స రానికి సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చే ఈ సబ్సిడీ లోన్ల మంజూరుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గ దర్శకాలు ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద రాబాద్ లో ఆదివారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సబ్సిడీ లోన్ల దరఖాస్తు తేదీలు, అర్హత వివరాలను విడుదల చేశా రు. రూ.6 వేల కోట్లతో ప్రారంభించిన ఈ పథకంలో రూ.3 వేల కోట్ల ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు భరిస్తుండగా.. మిగిలిన రూ.3 వేల కోట్లను బ్యాంకులు రుణసాయంగా అందజేస్తాయి. ఒక్క యూనిట్ కు 2 లక్షల వరకు సాయం అందిస్తారు.

ఏప్రిల్ 14 నుండి అమలుకు కసరత్తు…తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సబ్సిడీ లోన్ల మంజూరుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గ దర్శకాలు ఖరారు చేయగా ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారం లాంఛనంగా ప్రారంభిం చా రు.

అనంతరం లబ్ధిదారుల ఎంపిక సాయంపై కార్యాచరణ మొదలవు తుంది. ఈ పథకాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ జయంతి రోజైనా ఏప్రిల్ 14 నుండి అమలు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

చిన్న తరహా ఉపాధి యూనిట్ల పునరుద్ధరణకు…రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఈ పథకానికి ప్రభు త్వం రూపకల్పన చేసింది. గత సర్కారు దళిత బంధు, పరిశ్రమల యూనిట్ల స్థాపనకు భారీ మొత్తంలో యూనిట్లను మంజూరు చేసిన తర్వాత చిన్న తరహా ఉపాధి యూనిట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం తాజాగా వాటిని పూనరిద్దరిస్తుంది.

దీని కిందరూ.50 వేలు, రూ. లక్ష, రూ.2 లక్షల చొప్పున యూనిట్ల స్థాపనకు రుణాలను మంజూరు చేస్తారు. ప్రభుత్వం రాయితీ, మార్జి న్ మనీ అందించి రుణసాయం కోసం సిఫార్సు చేస్తుంది. ఏదైనా వ్యాపారం చెయ్యడం, చిన్న పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. ఇప్పుడున్న వ్యాపారాన్ని మరింత పెంచు కోవచ్చు. మహిళలు సైతం యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలు యువతకు ఎంతగానో ఉప యోగపడనున్నాయి.

దరఖాస్తు చేసుకున్న అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్ధులను ఎంపిక చేసి రుణాలను మంజూరు చేయడం జరుగు తుంది. రాయితీ తో రుణాలు అందించి ఆర్థిక చేయూతను అందించే ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయి. యువత సరైన ఉపాధి మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలోనే వారికి కార్పొరేషన్లు అందించే రుణాలు అండగా నిలుస్తున్నాయి. స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.

లబ్దిదారుల ఎంపిక ఇలా…పథకానికి కొత్తగా దరఖాస్తులు తీసుకుం చారు. అర్హులైన వారు తమ యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రా జెక్టు నివేదిక (డీపీఆర్)లను సమర్పించాలి. సంబందిత కార్పొరేషన్ తోపాటు బ్యాంకు అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.

పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా..రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో పేదల జీవన ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సబ్సి డీ లోన్లను అందించనుందని ప్రభు త్వం చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 6వేల కోట్ల తో ఈ పథకం ప్రారంభించనుండగా ఆయా బ్యాంక్ సబ్సిడీ లోన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఈ పథకంతో నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ డబ్బుతో లబ్దిదారులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు…మాన్య నాయక్ (ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నల్గొండ): స్టేట్ లెవల్ లో అప్రూవల్ అయింది. జిల్లాలకు ఎలాంటి ఇన్స్ స్ట్రక్షన్స్ రాలేదు. ఏప్రిల్ నెల నుండి ప్రారం భమయ్యే అవకాశం ఉంది. తేదీని ఇంకా ప్రకటించలేదు. ఏదైనా ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుంది.