ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామానికి చెందిన రిపబ్లి క్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ దేవరకొండ మస్తాన్ (జానయ్య) కేంద్ర న్యాయ శాఖ మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రామదాస్ అత్తా వలే ను డిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఆయన పుట్టిన రోజు సందర్బంగా పుష్ప గుచ్ఛం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్రం లో అణగారిన దళితుల కుటుంబాల పై దాడులు జరుగుతున్నాయని అరికట్టెందుకు చర్యలు తీసుకోవాలని మస్తాన్ మంత్రికి విన్నవించారు. అయన వెంట తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవి, రాష్ట్ర మహిళా నాయకురాలు పుష్ప తదితరులు ఉన్నారు.