*శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకుదర్శనం ఇచ్చినఅమ్మవారు.
Devi Navratri: ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలోని నయా నగర్ మదర్ తెరిసా స్కూల్ సమీపాన దేవీ నవరాత్రుల (Devi Navratri) ఉత్సవాలు ఘనంగా. నిర్వహిస్తున్నారు నాలుగవ రోజు అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి (Sri Lalita Tripura Sundari Devi)రూపంలో దర్శనం ఇచ్చారు.వేద పండితులు, భక్తులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నదానం తీర్థ,ప్రసాదాలు (Annadanam Theertha, Prasads) పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నయా నగర్ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.