Dhanunjaya Naidu: ప్రజా దీవెన, శాలిగౌరారం: భవన నిర్మాణం కార్మిక నాయకులు కమ్యూనిస్టు నేత రావుల యల్మ య్య ఆశయం సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీసీ సాంస్కృతిక సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు (Dhanunjaya Naidu)అన్నారు.శాలిగౌరారం లో బిసి నాయకుడు రావుల యల్మ య్య సంతావసభకు హాజరైన ఆయన మాట్లాడుతూ తన జీవి తం మొత్తం ఎర్రజెండాకు అంకితం చేసి బిసి ఉద్యమంలో (BC movement) ప్రముఖ పాత్ర వహించి పేద ప్రజల అభి వృద్ధి కోసం అహర్నిశలు శ్రమిం చాడని అయన అకాల మరణం బాధాకరమన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు యల్లబోయిన సింహాద్రి,వ్యవసాయ కార్యదర్శి సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రావుల స త్యం, ప్రజా నాట్యమండలి జిల్లా కళాకారుడు రావుల కృష్ణ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకులు గుడిపాటి శ్రీహరి గోళ్ళ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.