Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dhanurmas festivals: చందుపట్లలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని సీతారామ చంద్రస్వామి ఆలయం లోసోమవారం ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారం భమయ్యాయి. ఉత్సవాల్లో భాగం గా ఆలయంలో గోదాభక్త మండలి ఆధ్వర్యంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిం చారు.

ఈ కార్యక్రమంలో సీతా రామచంద్రస్వామి, లక్ష్మి నరసింహ స్వామి ఆలయాల చైర్మన్లు మేడ వరపు కిషన్ రావు, మంగినపల్లి వెంకటయ్య, గోదాభక్త మండలి సభ్యులు మంగినపల్లి సంప్రద, మామిళ్ల నాగమణి, పొనుగొటీ రాజేశ్వరి, కల్కూరి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.