ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సీతారా మచంద్రస్వామి ఆలయంలో ధను ర్మాస ఉత్సవాలు కొనసాగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజా మునే మహిళలు మంగళహార తులతో వచ్చి గోదాదేవి పూజలు చేశారు. గోదా భక్త మండలి ఆధ్వర్యంలో తిరుప్పావై పఠనం చేశారు. అలాగే భక్తి కీర్తనలు ఆలపించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేసిన సీతా రామచంద్రస్వామి ఆకారంలో వేసి ముగ్గు పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేడవరపు కిషన్‌రావు, మాజీ ఎంపీటీసీ గోనే నర్సింహరావు, కొప్పు సత్తయ్య, గంగుల వీరయ్య, వనం చందర్ రావు, అయిటిపాముల యాదగిరి, గోదా భక్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
