–తెలంగాణలో 30 దాటినవారిలో 14% మంది చక్కెరవ్యాధిగ్రస్తులు
–జాతీయస్థాయి సగటు 9.16 శాతం
–గణాంకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ
ప్రజా దీవెన, హైదరాబాద్: మధు మేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రా ల్లో మూడోస్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో మూడుపదుల పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్ పేషంట్స్ ఉన్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చి న నివేదికలో పేర్కొంది. అసాంక్రా మిక అంటే ఒకరి నుంచి మరొకరికి సోకని వ్యాధుల (ఎన్‌సీడీ) పోర్టల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30 వరకూ అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ గణాంకాల వివరాల ను అందులో వెల్లడించింది. జాతీ య ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ ఎమ్)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీ డీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ రక్తపోటు, మధుమేహానికి సంబం ధించిన పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో కలిపి 32, 33,32,732 మందికి పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 2,96,26 ,225 మందికి (9.16 శాతం) చక్కె రవ్యాధి ఉన్నట్టు తేలింది.
తెలంగా ణలో 1.75 కోట్ల మందికి పరీక్షలు చేయగా అందులో 24.52 లక్షల మంది షుగర్ పేషెంట్లే కావడం గమ నార్హం. అంటే పరీక్షలు చేయించుకు న్న వారిలో 14 శాతం మంది. పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి పరీక్షలు చేయగా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) మ ధుమేహం ఉన్నట్టు తేలింది. మహా రాష్ట్రలో 2.49 కోట్లమందికి పరీక్ష లు చేయగా.. 40.03 లక్షల మంది (16 శాతం)డయాబెటిస్ బాధితు లున్నట్టు వెల్లడైంది.
మూడో స్థానం లో తెలంగాణ ఉండగా ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (13 శాతం), కర్ణాటక (12 శాతం), మధ్య ప్రదేశ్ (11 శాతం) ఉన్నా యి. ఇక, చిన్నవైన ఈశాన్య రాష్ట్రా ల్లో నాగాలాండ్‌లో 32 శాతం, సిక్కింలో 25 శాతం షుగర్ వ్యాధి గ్రస్తులున్నట్టు ఎన్‌సీడీ లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55 శాతం కేసులతో పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది. అక్కడ లక్ష మందికి పరీక్షలు చేయ గా అందులో 55 వేలమందికి షుగ ర్ ఉన్నట్లు తేలింది. అండమాన్ నికోబార్‌లో 23 శాతం మంది మధుమేహులున్నారు
*దక్షిణాదిన దడ పుట్టిస్తోంది…*
దేశంలో దక్షిణాది రాష్ట్రాలు డయా బెటిస్ కేంద్రాలుగా మారుతున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నా యి. ఈ ఏడాది చేసిన పరీక్షల్లో మధుమేహ బాధితులుగా తేలిన వారు దేశం మొత్తమ్మీదా కలిపి 2.96 కోట్ల మంది ఉండగా అందు లో 1.36 కోట్ల మంది ఏపీ, తెలంగా ణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలవారేనని ఎన్‌సీడీ స్క్రీనిం గ్‌లో తేలింది.
*ఆహారపుటలవాట్లే అసలు సమస్య…* మన దగ్గర పట్టణ, నగర జనాభా ఎక్కువ. తెలంగా ణలో 42 శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు. ఉద్యోగులు, వైట్ కాలర్ జాబ్ చేసే వారి సంఖ్యా ఎక్కువే. మనది ధనిక రాష్ట్రం కావడంతో అలవాట్లు కూడా అలా గే మారాయి. చాలామంది ఇంట్లో తినడం మానేసి బయటే ఎక్కువ గా తింటున్నారని ప్రముఖ వైద్యు లు ఒకరు చెప్పారు. దేశంలో ఏ నగ రంలోనూ లేని విధంగా మన హైద రాబాద్‌లోరెస్టారెంట్లు, హో టళ్లు అన్నీ కలిపి 72 వేలకు పైగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అ ర్థం చేసుకోవచ్చు. జీవనశైలి చా లా మారింది. శారీరక శ్రమ తగ్గింది. వరి అన్నం ఎక్కువగా తినడం తదితర జీవన శైలి వల్లే మధుమే హం విసృతంగా వ్యాపిస్తోందoటు న్నారు వైద్యులు.