Digital survey: ప్రజా దీవెన, కట్టoగూర్: కుటుంబ డిజిటల్ కార్డు (Family Digital Card) పైలెట్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నా రాయణరెడ్డి ఆదేశించారు. గురువా రం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం,కట్టంగూర్ మండ లం రామ చంద్రాపురం గ్రామంలో ప్రారంభిం చిన కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సర్వే బృందాలకు ఇచ్చిన డేటాను ఆయన పరిశీ లించి డేటా (data) లో ఉన్న అన్ని కాల మ్స్ ను నింపాలని, ముఖ్యంగా వయస్సు విష యంలో ఆధార్ కార్డు ఆధా రంగా ఇప్పటి వయసును రాయాలని బృందాల కుసూచించారు.కుటుంబ సభ్యులు కొరినప్పుడు మాత్రమే వేరువే రుగా వివరాలు నింపాలని సూచిం చారు.
కాగా రామచంద్రపు రం లో 217 కుటుంబాలు ఉండగా, 2 సర్వే బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందానికి తహసి ల్దార్, మరో బృందానికి ఎంపీడీ వోలు నాయకత్వం వహిస్తున్నా రు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కట్టంగూరు తహసిల్దార్ కార్యా లయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి,ఆదాయ,కుల ధ్రువ పత్రాల జారీ, తదితర అంశాలపై తహసిల్దార్, సిబ్బందితో సమీక్షిం చారు. తహసిల్దార్ కార్యాల య పరిసరాలను తనిఖీ (check)చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సరానికి మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించా లని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. ధరణిలో మొత్తం 850 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, ఇప్పటివరకు 800 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, తహసిల్దార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పనుల నిమిత్తం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు.జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ,ఎంపీడీవో జ్ఞానే శ్వర్ తదితరులు ఉన్నారు.