Dil Raj : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు ఏకకా లంలో చేపట్టారు. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేయడంతో పాటు మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించా రు. పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యా లయాల్లో ఐటీ సోదాలు ముమ్మ రంగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఏకకాలంలో 8 చోట్ల 55 బృందా లతో తనిఖీలు జరుగుతున్నాయి.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సి తరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికా రులు సోదాలు చేస్తున్నారు. వ్యా పార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తు న్నారు.