Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DilsukhnagarBombblast : బిగ్ బ్రేకింగ్, బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

బిగ్ బ్రేకింగ్, బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

DilsukhnagarBombblast :  ప్రజా దీవెన, హైదరాబాద్‌: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌ సుఖ్‌నగర్‌ బాంబ్ బ్లాస్ట్ కేసు లో తె లంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషు లు వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మి స్ చేసింది. అంతేకాదు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషుల కు ఉరిశిక్ష విధిస్తూ ట్ర యల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టి స్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం దోషులందరికీ ఉరిశిక్ష ను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా 2013, ఫిబ్రవరి 21న దిల్‌సు ఖ్‌నగర్‌ లో వరుస బాంబు పేలుళ్ల కే సుపై ఎన్‌ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది.

2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీ ర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కో ర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో స వాల్ చేశారు నిందితులు. సుమా రు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మా సనం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. బాంబ్‌ బ్లాస్ట్‌లో వీరి కుట్ర ఉందని దోషులుగా తేల్చిం ది. ఈ ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చే స్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ను వెల్లడించింది.

వీరందరికీ ఉరిశిక్ష… ఈ కేసు లో ఏ2 అసదుల్లా అక్తర్ ( యూపీ), ఏ3జియ ఉర్ రహమాన్ ( పాకి స్థాన్), ఏ4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ ( బీహార్ ), ఏ5 మ హమ్మద్ యాసిన్ భత్కల్, ఏ6 అ జాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహా రాష్ట్ర) ఉన్నారు. అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇం కా పరారీలోనే ఉన్నాడు.