— ఆమ్ప్లికాన్ కంపెనీ డైరెక్టర్ కుషాల్ వాంగ్డేల్
Director Kushal Wangdale : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోటీన్ల అధ్యయనం లో, ఎస్డిఎస్ పేజ్, వెస్ట్రన్ బ్లాటింగ్ విధానంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమ్ ప్లీ ఖాన్ సంస్థ డైరెక్టర్ కుషాల్ వాంగుడేల్, ప్రతినిధి సత్యం ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు రెండు ప్రయోగాలలో మెలుకువలు, జాగ్రత్తలను ప్రయోగాత్మకంగా వివరించారు.
ఈ రంగంలో పరిశోధనలకు మంచి భవిష్యత్తు ఉన్నందున విద్యార్థులు ప్రయోగాలలో మెళుకువలు నేర్చుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రేమ్ సాగర్, విభాగ అధిపతి డా. తిరుమల, డా. కే. రామచందర్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.