— నూటికి నూరు శాతం తనిఖీ చేయాల్సిందే
–తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య
Director Sandeep Sandilya : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇటీవల డ్రగ్స్ (drugs) తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటి క్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజి టివ్ (positive)వచ్చిందని, తాజాగా నిర్వ హిం చిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వ చ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ (drugs) నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్కూ ల్స్, కాలేజీల్లో మత్తుపదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుం టున్నట్లు ఆయన చెప్పారు. పాఠ శాలలు, కళాశాలలు పునఃప్రారం భం అయిన నేపథ్యంలో యాజమా న్యాలకు టీజీ న్యాబ్ డైరెర్టర్ సందీ ప్ శాండిల్య ( Director Sandeep Sandilya) పలు సూచనలు చేశా రు.
విద్యాసంస్థల యాజమాన్యా లకు కీలక సూచనలు..
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు యాజమాన్యాలు స హకరించాలని సందీప్ శాండిల్య ( Director Sandeep Sandilya) కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల స్కూల్ బ్యాగులను (school bags) 100శాతం తనిఖీ చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బ్యా గుల్లో ఈ-సిగరెట్స్, గంజాయి, లిక్కర్ బాటిళ్లు ఉంటున్నాయని, అందుకే తప్పని సరిగా రోజూ వారి బ్యాగులు తనిఖీ చేయాలన్నారు. విద్యాసంస్థల్లో కొంతమంది సీనియ ర్లు జూనియర్లను డ్రగ్స్ కోసం ఉప యోగించుకుంటున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటి డ్రగ్ కమిటీలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిం చాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు ఒక రిటైర్డ్ పోలీ స్ను రిక్రూట్ చేసుకోవాలని ఆదే శించారు. రాష్ట్ర యువత భవిష్య త్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.