Disaffected students: విగతజీవులైన విద్యార్థులు
-- గజ్వేల్ సమీపంలోని రోడ్డు ప్రమాదం -- అయిదుగురు అక్కడికక్కడే దుర్మరణం
బ్రేకింగ్…
విగతజీవులైన విద్యార్థులు
— గజ్వేల్ సమీపంలోని రోడ్డు ప్రమాదం
— అయిదుగురు అక్కడికక్కడే దుర్మరణం
ప్రజా దీవెన/ గజ్వేల్: గజ్వేల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో అభంశుభం తెలియని విద్యార్ధులు విగత జీవులయ్యారు. శనిగరం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేటుచేసుకోగా ఐదుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
గజ్వేల్ కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్ లో పరీక్ష కు హాజరై ఆ తర్వాత గజ్వేల్ కు తిరుగు ప్రయాణమయ్యారు. శనిగరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీకి వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనగా ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదoలో గాయపడిన మిగతా ఆరుగురిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ఐదుగురు పరిస్థితి విషమం గా ఉన్నట్లు స్ధానిక పోలీసులు తెలిపారు.