Distribution of Books: ప్రజా దీవెన, కోదాడ: వేడుకల పేరిట డబ్బు వృధా చేయకుండా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో (public school)చదువుకునే పేద పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ (Distribution of Books)చేయడం అభినందనీయమని కోదాడ డివిజన్ విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. బుధవారం కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ (Municipal Vice Chairman) కందుల. కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను కోటేశ్వరరావు తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. పేదపిల్లలకు నోట్ పుస్తకాలను (note books) అందించి దాతృత్వం చాటుకున్న కందుల. కోటేశ్వరరావును ఈ సందర్భంగా సలీం షరీఫ్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు షాబుద్దీన్, నిరంజన్ రెడ్డి న్యాయవాది కొండల్ రెడ్డి, కోదాడ పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం. నరేష్,ఉపాధ్యాయులు బడుగుల.సైదులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.