Distribution of books: ప్రజా దీవెన, కోదాడ: బాప్టిస్ట్ చర్చి పెయిత్ (Baptist Church Peith) గాస్పల్ మినిస్ట్రీ కోదాడ పాస్టర్ ఏసయ్య ఆధ్వర్యంలో తమ్మర సుందరయ్య కాలనీ, కోదాడ గాంధీనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో( public school)చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు దాతల సహకారంతో ఉచితంగా అందజేశారుల.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చినట్లయితే ఎంతో మంది నిరుపేద పిల్లలు చదువు ను అందించిన వారవుతారని, విద్యార్థులలో ఆసక్తి ఉన్నప్పటికీ సరైన ఆర్థిక సహకారం (Financial support)లేకపోవటం వల్ల కొందరు పిల్లలు విద్యలో వెనుకబడిపోతున్నారు, దాతలు సహకరిస్తే ఇటువంటి పిల్లలకు, బట్టలు గాని ఆర్థిక సహకారం గాని బుక్స్ గాని సహకారం అందిస్తే వారు తమ టాలెంట్ ప్రదర్శించి ఉన్నత విద్యను (higher education) అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవేందర్ టీచర్స్ ద్రాక్షావల్లి విజయ కోటేశ్వరి, జీవని నాన్సీ తదితరులు పాల్గొన్నారు