Srinivas Reddy : ప్రజా దీవెన, నకిరేకల్: నల్లగొండ జి ల్లా నకరికల్ మండలం గొల్లగూడెం
ప్రాథమిక పాఠశాల విద్యార్ధుల పట్ల ఉదారత ప్రదర్శించాడు. పాఠశాల లోని సుమారు 18 మంది విద్యార్థు లకు భూపతికుంట గ్రామానికి చెం దిన వంగాల శ్రీనివాస్ రెడ్డి తన కు మార్తె, కుమారుల పుట్టినరోజును పురస్కరించుకొని 12000 రూపా యల విలువైన నోట్ పుస్తకాలు, షూస్, స్కూల్ బ్యాగులు అందజేశా రు.
అదేవిధంగా గొల్లగూడెం గ్రామానికి చెందిన చిరబోయిన బిక్షం యాదవ్ సుమారుగా 8,000 రూపాయల వి లువైన ఒక స్పీకర్ బాక్స్ మరియు పాఠశాల అవసరాల కోసం కుర్చీలు విరాళంగా అందజేశారు. ఈ కార్య క్రమoలో మండల విద్యాధికారి మే కల నాగయ్య ముఖ్య అతిథిగా పా ల్గొని విద్యార్థులకు స్వయంగా అం దజేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామస్తులని అభినందించా రు. విద్యార్థులకు మంచి బోధన చే యాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండగోని రవిశంకర్, సహ ఉపాధ్యాయురా లు సుస్మిత, చిరబోయిన సత్య నారాయణ, వెంకన్న, కవిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.