District Collector Ila Tripathi :అత్యవసర సదుపాయాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ప్రభుత్వ వైద్య కళాశాల మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ త్రిపాఠి --టీచింగ్ హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలోప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాకుండా అత్యవసరమైన వాటికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శనివారం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గదిలో నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల మానిటరింగ్ కమిటీ సమా వేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసే మౌలిక సదుపాయాలు, అకాడమిక్ సౌకర్యాలు, భవ నాలు, లెక్చర్ హాల్స్, లైబ్రరీ, లేబరేటరీ, విద్యార్థుల సంక్షేమం, హాస్ట ల్ తదితర విషయాలపై సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాకుండా అత్యవసరమైన వాటికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన మ్యూజియం, ఇండోర్ గేమ్స్ హాల్, డిస్సెక్షన్ హాల్, డైనింగ్ హాల్ లను పరిశీలించారు. ఆ తర్వాత మెడికల్ కళాశాల పక్కనే ఉన్న స్థలంలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆ పక్కనే ఉన్న ఎస్ఎల్బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాల ను తనిఖీ చేసి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్ నిర్మాణాన్ని తనిఖీ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.
వైద్యులను సన్మానించిన కలెక్టర్…వృత్తిపరంగా ఎన్నో ఒత్తిడిలు ఉన్నప్పటికీ వైద్య వృత్తి లో ఉంటూ పేద ప్రజలకు వైద్య సేవలం దించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా, గాంధీ, ఉస్మానియా ఆస్ప త్రులకు ధీటుగా నల్గొండ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల సహకా రంతో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి డాక్టట్లు అరుదైన శస్త్ర చికిత్సలు చేయడం పట్ల ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లను అభినం దించారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడం డాక్టర్ల బాధ్యత అయినప్పటికీ వారు చేస్తున్న సేవలు అమోఘమని, అందుకుగాను వారికి శుభా కాంక్షలు తెలియజేశారు. ఇటీవల ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ఒక డాక్టర్ల బృందం మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా, నిర్వహించగా మరో డాక్టర్ల బృందం 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి సుమారు 6 కిలోల కణతిని తొలగించడం జరిగింది. ఇందుకుగాను శనివారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందంలోని డాక్టర్లు శ్రీకాంత్, నిఖిత, దివ్య, అనస్తేసియా డాక్టర్లు డాక్టర్ బద్రి నారాయణ, పరమేశ్వరి, సుధ, గిరి లను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళా శాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి రెండింటిని పట్టిష్టం చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపా రు. విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో జిమ్ ఏ ర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా వృద్ధిలోకి రావాలని అన్నారు. సహాయ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులకు, అలాగే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి జిల్లా కలెక్టర్ అందిస్తున్న ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీతో పాటు, అన్ని రకాల సౌకర్యాలు, వైద్యపరమైన జాగ్రత్తలు, సేవలు అన్ని బాగున్నాయని, అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి మహిళ కడు పు లో నుంచి 6 కిలోల కణతిని తొలగించిన డాక్టర్ల బృంధాన్ని ఆయ న అభినందించారు. శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు శ్రీకాంత్, అనస్తే సియా డాక్టర్ బద్రి నారాయణ లు మాట్లాడుతూ శస్త్ర నిర్వ హించిన రోగి వివరాలు, సహకరించిన డాక్టర్లు, అనస్తేసియా బృందం తదిత ర వివరాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ సహాయ డైరెక్టర్ డా క్టర్ నగేష్ తో పాటు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాని, ప్ర భుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృ నాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ వినీల రాణి, రా మచంద్ర, టిఎస్ ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజీజ్,
డాక్టర్లు వందన, స్వరూప రాణి, తదితరులు ఉన్నారు.