District Collector Tejas Nand Lal Pawar : ప్రజదీవెన, సూర్యాపేట :గ్రామాలలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అందుబాటులో భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం భూభారతి చట్టం 20 25 పై అవగాహన సదస్సు తుంగతుర్తి పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణుమాధవరావు, హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పి పి టి చదివి వినిపించి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 20 25 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ నూతన చట్టాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు, ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025, ఈ భూ భారతి చట్టంలో గ్రామాలలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని దీనిలో కొన్ని అధికారాలు తాసిల్దార్, ఆర్డీవో ,అడిషనల్ కలెక్టర్,కలెక్టర్ స్థాయిలో వికేంద్రీకరణ చేశారని తెలిపారు. మండలాలలో త్వరలో భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాలలో సభలు నిర్వహించి అధికారులే రైతులు వద్దకు వచ్చి పరిష్కరిస్తారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల ఆప్పిల్ వ్యవస్థ ఉందని, ఆధార్ కార్డులా ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధరణి చట్టంలో లేని ఎన్నో, భూభారతి చట్టంలో కల్పించడం జరిగిందని దీనివలన రైతుల సమస్యలు పూర్తిగా పరీక్ష పరిష్కరించబడతాయని రెవెన్యూ అధికారులందరూ చట్టం పట్ల పూర్తి అవగాహన పొంది ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం తుంగతుర్తి శాసనసభ్యులుమందుల సామెల్ మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు అధికారులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, గత ప్రభుత్వం ధరణి వల్ల ఎలాంటి పరిష్కారాలు జరగలేదని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు భూతగాదాలు బాగా జరిగేవని ,దానివల్లనే ప్రజలు గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించారని ఎమ్మెల్యే తెలిపారు.ధరణి వల్ల రాష్ట్ర మొత్తంలో ఒక్క కుటుంబానికి మేలు జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. ఉగాదినాడు హుజూర్నగర్ లో సన్న బియ్యం పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికీ సన్న బియ్యం అందించి ఆదుకున్నారని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 294 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థికంగా వెనకబడి ఉన్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేరువవుతుందని ఎమ్మెల్యే అన్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను కష్టాల్లోకి నెట్టి వెళ్లారని ,ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రజలు తెచ్చిన ప్రభుత్వం మాదని, ఉద్యోగ విరమణ పొందిన మేధావులను, రెవెన్యూ అధికార లతో 14 నెలలు శ్రమించి భుభారతి చట్టానికి రపోదిడంజరిగిదని దీనివల్ల రైతులందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని, అధికారులు కూడా చట్టంతోపాటు, రూల్స్ కూడా రావడం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు . భూభారతిలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలలో ఎక్కడ నలుగురు ఉన్న భూభారతి చట్టం పై చర్చ జరగాలని, పాత్రికేయ మిత్రులు కూడా భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహనపరిచేలా కథనాలు రాయాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి తాసిల్దార్ పి దయానందం తిరుమలగిరి తాసిల్దార్ డి హరిప్రసాద్ ఎంపీడీవో సురేష్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.