–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ :రైతుల భూ సమస్యలు తీర్చేందు కే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం 2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా, గుండ్లపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల చట్టం -2025) పై అవగాహన కల్పించారు. ధరణిలో భూములకు సంబంధించి సవరణలు చేసేందుకు అవకాశం లేదని, భూ భారతి లో రికార్డులను అప్ డేట్ చేసే అవకాశం ఉందన్నారు. సక్సేషన్ ,మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్న 30 రోజులలో అవుతుందని,30 రోజులలో కాకుంటే 31 వ రోజు ఆటోమేటిక్ గా అవుతుందన్నారు.భూ భారతి లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదటే భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
ధరణిలో అనుభవదారులకు ప్రాధాన్యత లేదని,భూ భారతిలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.భూ భారతిలో భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయబడతాయని, ఈ వివరాలన్నీ అన్ని శాఖలకు పంపించడం జరుగుతుందని, ఎవరైనా ఈ వివరాలను చూసుకోవచ్చని అన్నారు.ఆధార్ కార్డ్ లాగే భూములకు భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, రుణాలు కావాలంటే రైతు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో ఉన్న భూముల వివరాల ఆధారంగా రైతుకు రుణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ధరణిలో లేని అప్పీల్ అవకాశం భూ భారతి లో ఉందని ఆమె వెల్లడించారు. అప్పీల్స్ అవకాశం భూ భారతి లో ఉందని, ధరణి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్లు సవరణలు చేసే అధికారం లేదని, ఇప్పుడు జిల్లా స్థాయిలోనే సవరణలు చేసే అధికారం ఉందని ఆమె తెలిపారు. ఒక వేళ రైతు న్యాయ సహాయం అవసరమైతే ఉచితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.సాదా బైనామీల వివాదాల పరిష్కారం భూ భారతి లో ఉందని అన్నారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్ భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.